రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

విమానాశ్రయం వెలుపల తన కోసం ఎదురుచూస్తున్న ప్రతిఒక్కరినీ మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తలు, స్థానిక ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, అభిమానులతో ఆయన ఫోటోలు దిగారు.

అనంతరం మంత్రి లోకేష్ కడప నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.