అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం 'లెనిన్'. ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాటను చిత్రబృందం విడుదల చేసింది. 'జయమంగళం' పేరుతో వచ్చిన ఈ మెలోడీ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. "అందరూ అడిగిన మెలోడీ... అందరూ ఎదురుచూస్తున్న మెలోడీ" అంటూ చిత్ర యూనిట్ ఈ పాటను ప్రేక్షకులకు అందించింది.

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన ఈ మెలోడీ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పాటలోని సాహిత్యం, ట్యూన్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా విడుదలైన ఈ ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్‌గా, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 'లెనిన్' చిత్రాన్ని జులై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నేడు 'లెనిన్' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. 
Play video