రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. శృంగవరపుకోట (ఎస్.కోట) ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో వధూవరులు అస్మిత నాయుడు, పవన్ మౌళీలకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అంతకుముందు, మంత్రి లోకేశ్ మంగళగిరిలో జరిగిన మరో కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి భట్టు అంబేద్కర్ కుమార్తె జెహారిక-రాహుల్ దీప్ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని, కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.