నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ‘ది ప్యారడైజ్’ నేడు  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. అయితే, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. బుక్‌మైషో, బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏకంగా 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’ చిత్రం ఘన విజయం సాధించడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రీ-బుకింగ్స్ జోరుగా సాగాయి. నాని గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద సంఖ్య కావడం విశేషం. సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఈ బుకింగ్సే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఈ సినిమాలో 'జడల్' అనే విభిన్నమైన పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్, ప్రచార చిత్రాలు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచాయి. ‘దసరా’కు పూర్తి భిన్నమైన ప్రపంచాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు దర్శకుడు చెప్పడంతో ఈ కొత్త కాంబో మరోసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.