ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, దీపావళి 2026 పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తన 'బిస్పోక్ ఏఐ' గృహోపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా వినియోగదారులకు భారీ క్యాష్‌బ్యాక్, సులభమైన ఈఎంఐ సదుపాయాలు కల్పిస్తోంది. ఈ ఆఫర్లు నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి. శాంసంగ్ పలు మోడళ్ల రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, వాక్యూమ్ క్లీనర్లు, ఓవెన్లు, డిష్ వాషర్లలో బిస్పోక్ ఏఐ ఫీచర్లను అందజేస్తోంది.

ప్రధాన ఆఫర్లు ఇవే.. 
ఎంపిక చేసిన బిస్పోక్ ఏఐ ఉపకరణాలపై గరిష్టంగా రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కేవలం రూ.888 ప్రారంభ ఈఎంఐతో ఉత్పత్తులను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. దీనితో పాటు 'ట్రిపుల్ జీరో ఆఫర్' కూడా అందిస్తున్నారు. దీని కింద జీరో డౌన్‌పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 6 నుంచి 10 నెలల వరకు జీరో వడ్డీతో ఈఎంఐలు చెల్లించవచ్చు. శాంసంగ్ ఫైనాన్స్+ ద్వారా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, టీవీఎస్ క్రెడిట్ వంటి సంస్థలతో కలిసి ఈ ఫైనాన్సింగ్ సదుపాయాలను అందిస్తున్నారు. అలాగే, శాంసంగ్ కేర్+ కింద అదనంగా 3 సంవత్సరాల వరకు వారంటీ పొందే అవకాశం కూడా ఉంది.

ఏఐ ఫీచర్లతో కొత్త అనుభూతి 
శాంసంగ్ తన 2026 బిస్పోక్ ఏఐ ఉపకరణాలను 'నిజమైన ఇంటి నేస్తాలు' (True Home Companions)గా అభివర్ణిస్తోంది. ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్‌లో జనరేటివ్ ఏఐ, ఏఐ ఫుడ్ మేనేజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలను గుర్తించి, వాటి నిల్వలను ట్రాక్ చేస్తుంది. స్మార్ట్‌థింగ్స్ ఫుడ్ యాప్ ద్వారా వంటకాలను సూచించడమే కాకుండా, గడువు ముగిసే పదార్థాల గురించి హెచ్చరిస్తుంది.

ఈ ఆఫర్లపై శాంసంగ్ ఇండియా డిజిటల్ అప్లయెన్సెస్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ గుఫ్రాన్ ఆలం మాట్లాడుతూ, "మా ఏఐ ఉపకరణాలు వినియోగదారుల రోజువారీ పనులను సులభతరం చేస్తాయి. ఈ దీపావళిని మరింత ప్రత్యేకం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్లను అందిస్తున్నాం" అని తెలిపారు. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో ఈ ఆఫర్లను పొందవచ్చు.