రాజధాని ఇళ్ల స్థలాల పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

  • రాజధాని భూములను పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం
  • 1251 ఎకరాల పంపిణీ కోసం జీవో జారీ
  • సర్కారు జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన రైతులు, న్యాయవాదులు
రాజధాని అమరావతి కోసం గత ప్రభుత్వం రైతుల నుంచి భూములను సమీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా భూముల్లో 1251 ఎకరాలను పేదలకు పంపిణీ చేసేందుకు వైసీపీ సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు జీవో కూడా ఇవ్వడంతో రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రైతులే కాదు, పలువురు న్యాయవాదులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

అటు, సీఆర్డీయే రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు, మూడు రాజధానుల బిల్లుపై దాఖలైన పిటిషన్లను కూడా విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 30కి వాయిదా వేసింది. జీఎన్ రావు, బోస్టన్ కమిటీల నివేదికలను సమర్పించాలని ఆదేశించింది.


More Telugu News