భక్త జనులతో కిక్కిరిసిన తిరుమల
- కొనసాగుతున్న వారాంతపు రద్దీ
- దర్శనానికి 10 గంటల సమయం
- శనివారం స్వామిని దర్శించిన 83 వేల మంది
వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామి సర్వదర్శనానికి 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో అద్దె గదులకు కొరత ఏర్పడింది. దీంతో భక్తులు ఆరుబయట, షెడ్ల కింద చలిలో అవస్థలు పడుతున్నారు.
కాగా, స్వామి సర్వ దర్శనానికి 10 గంటల వరకూ సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, దివ్య దర్శనం టోకెన్, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల్లో దర్శనం పూర్తవుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 83 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.