ఐఐటీ హైదరాబాద్ వద్ద‌ 1,600 మంది కూలీల ఆందోళన.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి

  • ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన కూలీలు
  • అడ్డుకున్న పోలీసులు
  • రాళ్లదాడిలో పోలీసుల వాహనం ధ్వంసం
పొట్ట చేతబట్టుకుని పనుల కోసం రాష్ట్రాలు దాటి‌ వచ్చి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను తమ సొంత గ్రామాలకు పంపాలని కొన్ని రోజులుగా వేడుకుంటోన్న కూలీలు పోలీసులపై దాడులకు దిగడం కలకలం రేపుతోంది. హైదరాబాదు సమీపం కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ భవనాల నిర్మాణ పనుల కోసం వచ్చిన 1,600 మంది ఈ రోజు ఆందోళనకు దిగారు.

గత నెల రోజులుగా ఇక్కడే చిక్కుకుపోయామని ఇంటికి వెళ్లనివ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికి వెళ్లడానికి సిద్ధమైన కూలీలను అడ్డుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పోలీసులపై రాళ్లు, కర్రలతో కూలీలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో రాళ్లు పడడంతో పోలీసు వాహనం ధ్వంసమైంది. దీంతో ఘటనా స్థలికి మరింత మంది పోలీసు బలగాలు భారీగా చేరుకుని, కూలీలను అదుపులోకి తెచ్చారు.


More Telugu News