చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా పర్యటనకు రాజ్‌నాథ్
- మూడు రోజులపాటు రష్యాలో పర్యటించనున్న రాజ్‌నాథ్
- రష్యా సైనికాధికారులతో విస్తృత చర్చలు
- చైనాతో వివాదానికి, రాజ్‌నాథ్ పర్యటనకు సంబంధం లేదన్న అధికారులు
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనకు నిన్న బయలుదేరి వెళ్లారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్‌నాథ్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్‌నాథ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యా సైనికాధికారులతో జరగనున్న విస్తృత చర్చల్లో పాల్గొనన్నారు.
అలాగే, రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై సోవియట్ యూనియన్ సైన్యం విజయానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న కవాతులోనూ రాజ్‌నాథ్ పాల్గొననున్నారు. కాగా, రాజ్‌నాథ్ పర్యటనకు, చైనాతో వివాదానికి సంబంధం లేదని, రష్యాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్‌నాథ్ ఆ దేశ పర్యటనకు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా నిర్వహించనున్న విక్టరీడే పరేడ్‌లో భారత్, చైనా సహా 11 దేశాల సైనిక బలగాలు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు.