తెలంగాణ సచివాలయ కూల్చివేతను నిలిపేయాలని హైకోర్టులో వ్యాజ్యం
- కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు
- ఆ ప్రాంతంలో పీల్చే స్వచ్ఛమైన గాలి కలుషితం
- మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ఉల్లంఘన
పాత సచివాలయాన్ని కూల్చేసి, కొత్త సచివాలయ భవనం కట్టాలని భావిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో శరవేగంగా చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. అయితే, ఆ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని ఈ రోజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు.
దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి, ఆ ప్రాంతంలో దాదాపు లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలి కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను పట్టించుకోకుండా భవనాలను కూల్చివేస్తున్నారని చెప్పారు. అయితే, ఈ పిల్‌ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు తెలిపింది.
మరోవైపు, సచివాలయం భవనాల కూల్చివేత పనులు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కిలోమీటరు పరిధిలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లే దారులన్నింటినీ బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. ఈ కూల్చివేత పనులను సీఎస్‌తో పాటు డీజీపీ, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.