భారత్ పట్ల చైనా వైఖరిని తప్పుబట్టిన బ్రిటన్... మధ్యలో మీ జోక్యం ఏంటన్న చైనా
- చైనా ప్రపంచానికి సవాల్ గా మారిందన్న బ్రిటన్ హైకమిషనర్
- మిత్రదేశాలకు మద్దతుగా నిలుస్తామని వ్యాఖ్యలు
- మూడో పక్షం జోక్యం అవసరంలేదన్న చైనా రాయబారి
భారత్ కు అనుకూల వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ పై చైనా మండిపడింది. భారత్ లో బ్రిటీష్ హైకమిషనర్ ఫిలిప్ బార్టన్ మాట్లాడుతూ, హాంకాంగ్ లో జాతీయ భద్రతా చట్టం అమలు, భారత్ తో సరిహద్దు ప్రతిష్టంభన సహా అనేక అంశాల్లో చైనా చర్యలు ప్రపంచానికి సవాలుగా పరిణమించాయని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టం అతిక్రమణలను ప్రశ్నించే క్రమంలో బ్రిటన్ ఎల్లప్పుడూ తన భాగస్వామ్య దేశాలకు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. దీన్ని భారత్ లో చైనా రాయబారి సన్ వీడోంగ్ తప్పుబట్టారు. భారత్ తో సరిహద్దు వ్యవహారం ద్వైపాక్షిక అంశమని, దీంట్లో మూడో పక్షం ప్రమేయం అవసరం లేదంటూ కటువుగా వ్యాఖ్యానించారు.
"భారత్ లో బ్రిటీష్ హైకమిషనర్ చైనాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ఆరోపణలు, అసత్యాలను గుమ్మరించారు. సరిహద్దు అంశాన్ని చైనా-భారత్ చూసుకుంటాయి. మాకు ఆ మేరకు జ్ఞానం ఉంది. విభేదాలను సమర్థంగా పరిష్కరించుకోగల నేర్పు ఉంది. మూడో పక్షం జోక్యం మాకవసరంలేదు" అని వీడోంగ్ ట్వీట్ చేశారు.