కరోనాతో ఆసుపత్రిపాలైన నటుడు దిలీప్ కుమార్ సోదరులు
- అస్లాం ఖాన్, ఎహసాన్ లకు కరోనా
- ముంబయి నానావతి ఆసుపత్రిలో చికిత్స
- రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిందన్న వైద్యులు
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ సోదరులకు కరోనా సోకింది. దిలీప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్, ఎహసాన్ ఖాన్ లకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వారిద్దరినీ ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారని డాక్టర్లు వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసఫ్ ఖాన్. ఆయన దేశ విభజనకు ముందు పెషావర్ లో జన్మించారు. దిలీప్ కుమార్ 12 మంది సంతానంలో ఒకరు. ఆయన సినీ రంగంలో ప్రవేశించి తనదైన నటనతో అభిమానులను విశేషంగా అలరించారు. దిలీప్ కుమార్ వయసు 97 ఏళ్లు.