రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తులో చంద్రబాబు కుట్ర బయటపడుతుంది: విజయసాయిరెడ్డి
- చంద్రబాబు హస్తం ఉంది
- చంద్రబాబు హైదరాబాద్లో ఉంటున్నారు
- ఏపీలో అలజడి సృష్టించాలనుకుంటున్నారు
తూర్పు గోదావారి జిల్లా అంతర్వేదిలో చోటు చేసుకున్న రథం దగ్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఘటన వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ ఏపీలో అలజడి సృష్టించాలనుకుంటున్నారని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరిందని ఆయన గుర్తు చేశారు. ఈ విచారణలో చంద్రబాబు, లోకేశ్ ల హస్తం బయటపడుతుందని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగాయని ప్రచారం చేయాలనుకున్నారని ఆయన చెప్పారు. కాగా, విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటనతో ఈ జిల్లాలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు ఎవరైనా సరే భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.