బీహార్ లో ఎన్డీయే గెలిచినా నితీశ్ కు ఛాన్స్ లేదా?.. స్వరం మారుస్తున్న బీజేపీ!

  • ఎన్డీయేకు అనుకూలంగా బీహార్ ఫలితాలు
  • అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ
  • సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామన్న బీజేపీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మహాకూటమి ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత ఎన్డీయే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. ముఖ్యంగా బీజేపీ సత్తా చాటుతూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం ఎన్డీయే 128 స్థానాల్లో, మహాకూటమి 105 స్థానాల్లో, ఎల్జేపీ 2 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఎన్డీయే విజయం సాధిస్తే సీఎం ఎవరవుతారనే చర్చ మొదలైంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ, బీజేపీ కంటే జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినా నితీశ్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

అయితే బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్ వర్గీయ ఈ మధ్యాహ్నం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎంపిక అంశాలపై సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో, సొంత వ్యక్తినే బీజేపీ సీఎంగా ఎంపిక చేయబోతోందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.


More Telugu News