‘ఆర్ఆర్ఆర్’ కోసం హైదరాబాద్ వస్తూ.. మహేశ్ కూతురు సితారకు గిఫ్ట్ తీసుకొచ్చిన అలియాభట్
- సితారకి తన సొంత బ్రాండ్ దుస్తులు ఇచ్చిన అలియా
- వేసుకుని మురిసిపోయిన సితార
- తనకెంతో ఇష్టమైన హీరోయిన్ ఇచ్చిందని వ్యాఖ్య
టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో దర్శకుడు రాజమౌళి రూపొందిస్తోన్న మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ కథానాయిక అలియాభట్ నిన్న హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న చెర్రీ పక్కన సీత పాత్రలో అలియాభట్ నటించనుంది. ఆమె హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా హీరో మహేశ్ బాబు కూతురు సితారకి తన సొంత బ్రాండ్ దుస్తులు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇచ్చింది.
వాటిని ధరించిన సితార ఆ దుస్తుల్లో తనని తాను చూసుకుని మురిసిపోయింది. తనకెంతో ఇష్టమైన హీరోయిన్ అలియా భట్ ఈ దుస్తులు తీసుకొచ్చిందని, ఈ డ్రెస్ తనకెంతో నచ్చిందని సితార ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.
కాగా, 2018లో మహర్షి షూటింగ్ కోసం మహేశ్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ వెళ్లాడు. ఆ సమయంలో అలియా భట్ మూవీ షూటింగ్ కూడా అక్కడే జరుగుతోన్న నేపథ్యంలో సితార-అలియాభట్ కలిసి మాట్లాడుకుని ఫ్రెండ్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చిట్టి సితారకు అలియాభట్ దుస్తులు తీసుకొచ్చింది.