జనవరి 8న ఎల్బీనగర్ చౌరస్తాలో జాతీయ రహదారి దిగ్బంధంకు పిలుపు!
- గో సడక్ బంద్ నిర్వహిస్తాం
- విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం
- గోవధ శాలలను మూసేయాలి
- టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ ప్రకటన
ఆవుల సంరక్షణ కోసం జనవరి 8వ తేదీన గో సడక్ బంద్ నిర్వహించనున్నట్లు టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ ప్రకటించారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాలో బంద్ నిర్వహిస్తామని, 10 వేల మందితో విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని తెలిపారు.
సమాజంలో గోరక్షణ జరగాలని ఆయన అన్నారు. గోవధ శాలలను మూసేయాలని డిమాండ్ చేశారు. దేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ గోమాతలు కబేళాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోవును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జనవరి 8న నిర్వహించనున్న సడక్ బంద్‌లో పలువురు మఠ, పీఠాధిపతులు కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు.