రైతుల ఆందోళనపై హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు
- ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియదు
- వారు ఏం కోరుకుంటున్నారో కూడా వాళ్లకే తెలియదు
- వారి ఆందోళన స్వచ్ఛందమైనది కాదు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో చలి, వానకు కూడా బెదరకుండా వారు చేస్తోన్న పోరాటంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో, వారు ఏం కోరుకుంటున్నారో కూడా వాళ్లకే తెలియదని హేమమాలిని అన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఏ సమస్య ఉందో కూడా వాళ్లకు తెలియదంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారి ఆందోళన స్వచ్ఛందమైనది కాదని దీన్ని బట్టే స్పష్టమవుతోందని చెప్పారు. వారితో కొందరు ఈ ఆందోళన చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు.