నరసరావుపేటలో గోపూజ మహోత్సవం.. పాల్గొన్న ముఖ్యమంత్రి
- మున్సిపల్ స్టేడియంలో కార్యక్రమం
- పాల్గొన్న వెల్లంపల్లి, చెరుకువాడ, మేకతోటి సుచరిత
- ఏపీలోని 2,147 ఆలయాల్లోనూ పూజలు
గోపూజ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి వచ్చారు. ఈ గోపూజ మహోత్సవంలో జగన్ తో పాటు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ పూజలను టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ సందర్భంగా ఏపీలోని 2,147 ఆలయాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోమాత గురించి భక్తులకు తెలియజేస్తూ దేవాలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంట్లో గోవులను పూజించాలని పూజారులు చెప్పారు.