రైతులు దాడి చేయడంతో 15 అడుగుల గోడపై నుంచి పడిపోయిన పోలీసులు.. వీడియో ఇదిగో
- నిన్న ఢిల్లీలో రైతుల ఆందోళన
- బారికేడ్లను తొలగించి వెళ్లేందుకు రైతుల యత్నం
- ఎర్రకోట సమీపంలో ఘటన
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో నిన్న రైతులు నిర్వహించిన ఆందోళనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో రైతులు కర్రలతో పోలీసుల వెంట పడడంతో పోలీసులు వారి నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఇందుకు సంబంధించిన మరో వీడియో మీడియాకు చిక్కింది. ఎర్రకోట సమీపంలో బారికేడ్లను తెంచుకుని రైతులు ముందుకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఆ సమయంలో పోలీసులపై దాడికి యత్నించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులు 15 అడుగుల గోడపై నుంచి గోతిలోకి దూకారు. మరికొందరు పోలీసులు అక్కడ పట్టుకుని నిలబడేందుకు ఏమీ లేకపోవడంతో జారిపోయి 15 అడుగుల లోతులో పడిపోయారు.