ఆసియా కుబేరుడిగా మళ్లీ ముఖేశ్ అంబానీయే!

  • చైనాకు చెందిన ఝోంగ్ షన్షాన్ ను దాటేసి ముందుకు
  • బ్లూమ్ బర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్స్
  • 2,200 కోట్లు పోగొట్టుకున్న ఝోంగ్
  • 8 వేల కోట్ల డాలర్లతో అంబానీకి మొదటి స్థానం
ఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీ మళ్లీ తన కిరీటాన్ని తెచ్చేసుకున్నారు. చైనాకు చెందిన ఝోంగ్ షన్షాన్ ను వెనక్కు నెట్టి ఆసియాలో అత్యంత ధనికుడిగా అవతరించారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. ఝోంగ్ కు చెందిన బాటిల్డ్ వాటర్ కంపెనీ 20 శాతం మేర నష్టపోయింది. దాదాపు 2,200 కోట్ల డాలర్లను నష్టపోయారు. దీంతో అంబానీ ముందుకొచ్చేశారు.

ప్రస్తుతం 8 వేల కోట్ల డాలర్లతో ఆసియా కుబేరుడిగా అంబానీ నిలిచారు. ఆ తర్వాత 7,660 కోట్ల డాలర్ల సంపదతో ఝోంగ్ రెండో స్థానాన్ని సాధించారు. అంతకుముందు జాక్ మాను దాటి ఝోంగ్ మొదటి ర్యాంకును దక్కించుకున్నారు.

మరోవైపు ముఖేశ్ అంబానీ రిలయన్స్ డిజిటల్ లోని తన వాటాను అమ్మడం ద్వారా సంపదను మరింత పెంచుకున్నారు. గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలకు రిటైల్ యూనిట్లను అమ్మారు. అయితే, గత ఏడాది ఫోర్బ్స్ రియల్ టైం బిలయనీర్స్ జాబితాలో ముఖేశ్ అంబానీ మూడు స్థానాలు కోల్పోయారు.


More Telugu News