తిరుపతి ప్రచారానికి కదులుతున్న బీజేపీ జాతీయ, తెలంగాణ నేతలు.. వివరాలు!
- బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన రత్నప్రభ
- ఏప్రిల్ 3న ప్రచారం నిర్వహించనున్న పవన్ కల్యాణ్
- తిరుపతిలో పర్యటించనున్న నడ్డా, నిర్మల, బండి సంజయ్, రాజాసింగ్
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారపర్వం వేడెక్కుతోంది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం చేసేందుకు నేతలు తరలి వస్తున్నారు. రత్నప్రభకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ ఏప్రిల్ 3న తిరుపతిలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అంతేకాదు నగరంలోని ఎమ్మార్ పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర కూడా చేపట్టనున్నారు.
మరోవైపు రత్నప్రభ తరపున ప్రచారం చేసేందుకు తెలంగాణకు చెందిన కీలక నేతలు తిరుపతికి వస్తున్నారు. వీరి ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. అందరికంటే ముందుగా ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ప్రచార పర్వంలోకి అడుగుపెట్టనున్నారు. ఏప్రిల్ 4న రాజాసింగ్, 5న రఘునందర్ రావు, 14న బండి సంజయ్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో పర్యటించనున్నారు.