రెండోసారి కరోనా బారినపడిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో

  • బాబుల్ సుప్రియోకు తాజాగా కరోనా పాజిటివ్
  • ఆయన భార్యకు కూడా కరోనా
  • కొన్నినెలల వ్యవధిలో మరోసారి కరోనా బారినపడిన కేంద్ర మంత్రి
  • రేపు బెంగాల్లో ఓటు వేయలేకపోతున్నానని సుప్రియో విచారం
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో మరోసారి కరోనా బాధితుడయ్యారు. ఆయనకు రెండోసారి కరోనా సోకింది. గతంలో ఓసారి కరోనా నుంచి కోలుకున్న బాబుల్ సుప్రియో... కొన్నినెలల వ్యవధిలోనే మరోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. ఆయన అర్ధాంగికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

దీనిపై బాబుల్ సుప్రియో స్పందిస్తూ... తనకు, తన భార్యకు కరోనా సోకిందని వెల్లడించారు. అందుకే, రేపు పశ్చిమ బెంగాల్ లో జరిగే ఏడో విడత ఎన్నికల్లో అసన్ సోల్ లో ఓటు వేయలేనని వెల్లడించారు. ఓటు వేయలేకపోతున్నందుకు ఎంతో విచారిస్తున్నానని పేర్కొన్నారు. అయితే, అసన్ సోల్ నియోజకవర్గంలోని బీజేపీ నేతలకు తన మద్దతు ఉంటుందని, ఇంటి నుంచే పరిస్థితిని పర్యవేక్షిస్తుంటానని తెలిపారు.


More Telugu News