లాల్‌జాన్‌బాషా సోదరుడు జియావుద్దీన్ టీడీపీకి రాజీనామా.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు!
- బాషా మరణం తర్వాత రాజకీయంగా ఇబ్బందులు
- మీరు మారుతారని ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది
- మీ స్వార్థ ప్రయోజనాల కోసం మమ్మల్ని వాడుకున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ చైర్మన్, లాల్‌జాన్‌బాషా సోదరుడు జియావుద్దీన్ రాజీనామా చేశారు. చంద్రబాబు విధానాలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్టు బహిరంగ లేఖ రాశారు. పార్టీ కోసం, రాజకీయంగా మీ ఎదుగుదల కోసం తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా వాడుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. బాషా మరణించిన తర్వాత రాజకీయంగా తమను ఇబ్బందులకు గురిచేసిన విషయం అందరికీ తెలుసన్నారు.
మీ ప్రవర్తనలో ఏనాటికైనా మార్పు వస్తుందని ఇన్నాళ్లు ఎదురుచూశామని, కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్న మీ తీరు తమతో సహా పార్టీలో వ్యక్తిత్వం కలిగిన వారికి మొదటి నుంచి కూడా ఇబ్బందిగానే ఉందన్నారు.
ఇటీవల హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసమైన సందర్బంలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు రఘురామకృష్ణ రాజు అరెస్ట్ విషయంలో కులాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై ఆరోపించారు. ప్రాంతాల మధ్య విభజన చేసే మీ రాజకీయం పార్టీకి మరణశాసనంగా మారిందని జియావుద్దీన్ ఆ లేఖలో పేర్కొన్నారు.