సీఎం అశోక్ గెహ్లాట్ కు... పోస్ట్ కోవిడ్ సమస్యలు.. ఆసుపత్రిలో చేరిక
- నిన్న ఛాతీ నొప్పికి గురైన గెహ్లాట్
- ఈ ఉదయం ఆసుపత్రిలో చేరిక
- యాంజియోప్లాస్టీ నిర్వహిస్తామన్న డాక్టర్లు
కరోనా నుంచి కోలుకున్న వారు పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో బాధపడుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనాకు గురైన గెహ్లాట్... మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరారు. నిన్న ఆయన ఛాతీ నొప్పికి గురికాగా... ఈ ఉదయం ఆసుపత్రిలో చేరారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహిస్తామని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఆసుపత్రి నుంచి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల నిన్నటి నుంచి ఛాతీలో విపరీతమైన నొప్పిగా ఉందని ఆయన తెలిపారు. యాంజియోప్లాస్టీ నిర్వహించబోతున్నారని చెప్పారు. ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో దీన్ని నిర్వహించనున్నారని తెలిపారు. తాను బాగానే ఉన్నానని... త్వరలోనే ఆరోగ్యంతో బయటకు వస్తానని చెప్పారు. మీ అందరి ఆశీర్వాదాలు తనతో ఉంటాయని అన్నారు.