మళ్లీ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

  • పుప్పాలగూడలో 94.56 ఎకరాల విక్రయం
  • ఖానామెట్ భూములు కూడా
  • 27, 29వ తేదీల్లో వేలం నిర్వహణ
ఇటీవలే కోకాపేట్, ఖానామెట్ భూములను వేలం వేసి భారీగా సొమ్ము చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. మరోసారి భూములను వేలం వేసేందుకు నిర్ణయించింది. వచ్చే నెల 27, 29వ తేదీల్లో భూములను వేలం వేయనుంది. 117.35 ఎకరాల భూముల విక్రయానికి ఎల్లుండి టీఎస్ఐఐసీ నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.

27న నిర్వహించే వేలంలో ఖానామెట్ లో 22.79 ఎకరాల భూములను వేలం వేయనుంది. వీటిని 9 ప్లాట్లుగా విక్రయిస్తారు. 29న పుప్పాలగూడలో 94.56 ఎకరాల భూములను 26 ప్లాట్లుగా చేసి వేలానికి పెడుతున్నారు. కాగా, తొలి దఫా నిర్వహించిన వేలంలో ఖానామెట్ లో ఎకరం భూమి రూ.55 కోట్లు పలికింది. ఆ భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. కోకాపేట భూముల వేలంపై విచారణ నడుస్తోంది.


More Telugu News