అధోగతిలో అగ్రస్థానం, ప్రగతిలో చిట్టచివరి స్థానం... ఇదీ జగన్ పాలన: లోకేశ్ విమర్శలు

  • థర్డ్ వేవ్ హెచ్చరికలు వచ్చాయన్న లోకేశ్
  • అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయని వెల్లడి
  • వ్యాక్సినేషన్ వేగవంతం చేశాయని వివరణ
  • ఏపీ సర్కారు మేల్కొనాలని హితవు
సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ పాలనలో రాష్ట్రం పరిస్థితి అధోగతిలో అగ్రస్థానం, అభివృద్ధిలో చిట్టచివరి స్థానం అన్నట్టుగా తయారైందని వ్యాఖ్యానించారు. ఎవరెలా చస్తే నాకేంటి... తాడేపల్లి నివాసంలో నేను హాయిగా నిద్రపోతే చాలు అని జగన్ భావిస్తున్నారని మండిపడ్డారు.

థర్డ్ వేవ్ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై వ్యాక్సినేషన్ ను వేగవంతం చేశాయని లోకేశ్ తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం 18 ఏళ్లు నిండినవారికి ఒక్కడోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మాత్రమే వేసి దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని వివరించారు.

కులపిచ్చతో వ్యాక్సిన్ కంపెనీపై ఏడ్చే బదులు, వచ్చిన వ్యాక్సిన్ వృథా కాకుండా వేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని లోకేశ్ స్పష్టం చేశారు. తాడేపల్లి నివాసంలో పడుకున్న జగన్ గారూ నిద్రలేవండి... థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే హెచ్చరికలపై మేల్కొనండి అని హితవు పలికారు.


More Telugu News