మూడు రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయండి.. తాలిబన్ల హుకుం!
- నిరసనలు చేస్తున్న కాందహార్ ప్రజలు
- స్థానికులకు తాలిబన్ ప్రభుత్వ అధికారుల ఉత్తర్వులు
- ఆఫ్ఘనిస్థాన్ సైన్యం భూముల్లో నివసిస్తున్న ప్రజలకు నోటీసులు
ఆఫ్ఘనిస్థాన్‌ను మెరుపు వేగంతో ఆక్రమించిన తాలిబన్లు ఇటీవలే తమ తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. మహిళలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడంపై తాలిబన్ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
ఇప్పుడు తాజాగా కాందహార్ ప్రాంతంలోని ప్రజలకు తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ జాతీయ సైన్యానికి చెందిన ఇక్కడి భూముల్లో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరందరూ ఇళ్లు ఖాళీ చేయాలని తాలిబన్ ప్రభుత్వ అధికారులు హుకుం జారీచేశారు.
ఇలా ఇళ్లు వదిలి వెళ్లడానికి మూడు రోజుల గడువు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలను స్థానిక ప్రజలు అంగీకరించడం లేదు. వీటికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. తాము ఇక్కడ 20 ఏళ్లుగా ఉంటున్నామని, ఇక్కడ కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నామని ప్రజలు అంటున్నారు.