ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు నియామకం

  • కౌన్సిల్ 14వ టర్మ్ సభ్యుల నియామకం
  • ఎడిటర్ గిల్డ్స్ నుంచి ఆరుగురు
  • వర్కింగ్ జర్నలిస్టుల నుంచి ఏడుగురు నియామకం 
టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సభ్యుడిగా నియమితులయ్యారు. కౌన్సిల్ 14వ టర్మ్ సభ్యులను నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. సభ్యుల్లో ఎడిటర్స్ గిల్డ్ నుంచి ఆరుగురు, వర్కింగ్ జర్నలిస్టుల నుంచి ఏడుగురు, మధ్య తరహా, చిన్న తరహా వార్తాపత్రికల యాజమాన్యాల నుంచి ఇద్దరేసి, న్యూస్ ఏజెన్సీ మేనేజర్లు, యూజీసీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సాహిత్య అకాడమీ నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా నియమితులయ్యారు.


More Telugu News