10 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న మోదీ

  • దేశంలో వందకోట్లు దాటిన టీకాల పంపిణీ
  • మోదీ ప్రసంగం దీనిపైనే మాట్లాడే అవకాశం
  • దేశంలోని 70 శాతం మందికి ఒక డోసు టీకా
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరికాసేపట్లో (10 గంటలకు) జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. నిన్నటితో వందకోట్ల టీకాల పంపిణీ పూర్తయింది. మోదీ ఈ అంశంపైనే మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

దేశంలో ఈ ఏడాది జనవరి 16న టీకా కార్యక్రమం మొదలైంది. తొలుత వృద్ధులకు టీకాలు ఇవ్వగా ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన 279 రోజుల్లోనే వందకోట్ల టీకాలు పంపిణీ చేశారు. 70 శాతం మంది ఒక డోసు టీకా తీసుకోగా, 31 మంది రెండు డోసులు తీసుకున్నారు. రోజుకు సగటున 35,84,223 మందికి టీకాలు వేస్తున్నారు.


More Telugu News