సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనమేంటి?: రామ్ గోపాల్ వర్మ

  • ఏపీలో సినిమా టికెట్ల రేట్లు బాగా తగ్గింపు
  • టాలీవుడ్ నుంచి నిరసన గళం
  • టికెట్ రేట్లు నిర్మాతలు నిర్ణయిస్తారన్న వర్మ 
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదని అన్నారు. ఓ వస్తువు ఉత్పత్తిదారుకే ఎమ్మార్పీ నిర్ణయించే అధికారం ఉంటుందని, కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడు నిర్ణయించుకుంటాడని వర్మ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల రేట్లను నిర్మాతలు నిర్ణయించడంలో తప్పేమీలేదని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం టికెట్ల రేట్లు నిర్ణయించడం ఏంటో అర్థంకావడంలేదని తెలిపారు.

ఓ వస్తువును ప్రైవేటు వ్యక్తులు ఉత్పత్తి చేసి, వినియోగదారుడికి అమ్మే క్రమంలో పన్నులు ప్రభుత్వానికే వెళతాయని, అయితే, ఇందులో ప్రభుత్వం ధరలు నిర్ణయించడం ఉండదని వర్మ వివరించారు. సినిమా టికెట్ల అంశానికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు.


More Telugu News