వనమా రాఘవేందర్ ను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ
- పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య
- ఎమ్మెల్యే వనమా తనయుడిపై తీవ్ర ఆరోపణలు
- తీవ్రంగా పరిగణించిన టీఆర్ఎస్ హైకమాండ్
- పరారీలోనే వనమా రాఘవేందర్
పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అతడిపై వచ్చిన ఆరోపణలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. కాగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడైన రాఘవేందర్ అరెస్ట్ పై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది. అతడిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను పోలీసులు ఖండించడంతో రాఘవేందర్ ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది.
పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. సూసైడ్ నోట్ తో పాటు, సెల్ఫీ వీడియోలోనూ వనమా రాఘవేందర్ ప్రస్తావన ఉండడంతో అతడిపై పాల్వంచ పీఎస్ లో కేసు నమోదైంది. కాగా, గతంలో ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మధ్యాహ్నం లోగా లొంగిపోవాలంటూ స్పష్టం చేశారు.