సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలు... ఫొటోలు ఇవిగో!

  • రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు
  • తాడేపల్లిలోనూ వేడుకలు
  • సంప్రదాయ దుస్తుల్లో హాజరైన సీఎం జగన్
  • రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఏపీలో సంక్రాంతి కోలాహలం నెలకొంది. నేడు భోగి సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలోని గోశాల వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు సీఎం జగన్, ఆయన అర్ధాంగి వైఎస్ భారతి హాజరయ్యారు. సీఎం జగన్ సంప్రదాయ పంచె కట్టుతో కనిపించారు. గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి సంబరాలు కనిపిస్తాయో అన్నింటిని తాడేపల్లిలోని సీఎం నివాసంలో నిర్వహించారు.

భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, గోమాతలకు పూజలు, సంక్రాంతి నృత్యాలు, డప్పు మోతలు, కోలాటాలు, పిండివంటలు... ఇలా సీఎం నివాసంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలను ఆస్వాదించిన సీఎం జగన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ శుభం జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News