హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి... ఎయిర్ పోర్టుకు వచ్చిన సీఎం కేసీఆర్

  • సమతామూర్తిని సందర్శించనున్న రాష్ట్రపతి
  • స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
  • ఇటీవల మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం
  • కేసీఆర్ పై తీవ్ర విమర్శలు
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రపతి ఈ మధ్యాహ్నం ముచ్చింతల్ ఆశ్రమంలోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. కాగా, రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఆయనను స్వాగతించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా ఎయిర్ పోర్టుకు విచ్చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టుకు రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి కోసం నిరీక్షిస్తుండడాన్ని మీడియా కెమెరాలు బంధించాయి. ప్రోటోకాల్ ప్రకారం తొలుత గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి స్వాగతం పలుకగా, ఆపై సీఎం కేసీఆర్ శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతికి అందరినీ పేరుపేరునా పరిచయం చేశారు.


More Telugu News