బీజేపీ అసమ్మతి నేతలతో బండి సంజయ్ భేటీ
- రెండు దఫాలుగా అసమ్మతి నేతల భేటీలు
- బండి సంజయ్‌కు వ్యతిరేకంగానే సమావేశాలు
- చర్యలు తప్పవంటూ బండి వార్నింగ్
- ఆ వార్నింగ్‌తోనే దిగొచ్చిన అసమ్మతి నేతలు
గత కొన్నిరోజులుగా బీజేపీ తెలంగాణ శాఖకు ప్రత్యేకించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తలనొప్పిగా మారిన అసమ్మతి రాగం చల్లారిపోయింది. ఇప్పటికే రెండు దఫాలుగా రహస్య భేటీలు నిర్వహించిన బీజేపీ అసమ్మతి నేతలు శుక్రవారం నాడు బండి సంజయ్‌తో భేటీ అయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని ఇటీవలే బండి సంజయ్ ప్రకటించి సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో అసమ్మతి నేతలు దిగొచ్చినట్లుగా సమాచారం.
బండి సంజయ్‌తో జరిగిన భేటీలో చాలా మంది నేతలు తాము పార్టీ లైన్లోనే ఉన్నామని ప్రకటించారు. మరికొందరు నేతలు అసలు తాము అసమ్మతి నేతల భేటీకే హాజరు కాలేదని కూడా చెప్పారట. పార్టీ లైన్ ధిక్కరించే వారిపై పార్టీ కేంద్ర నాయకత్వం ఎలా వ్యవహరిస్తుందో తెలుసు కదా అంటూ హెచ్చరించిన బండి సంజయ్.. ఇకపై ఏ సమస్య ఉన్నా తనతోనే మాట్లాడాలని, ఏ సమస్యను అయినా చర్చించుకుని పరిష్కరించుకుందామని చెప్పారట. దీంతో అసమ్మతి నేతలు కూడా సర్దుకున్నట్లుగా సమాచారం.