నో పాలిటిక్స్ ఎటాల్... కేసీఆర్‌తో భేటీపై తికాయత్
- రైతు నేతలకు రాజకీయాలతో సంబంధం లేదు
- కేసీఆర్‌తో భేటీలో వ్యవసాయం గురించే చర్చ
- వ్యవసాయ ప్రత్యామ్నాయాల కోసం ఇతర రాష్ట్రాల సీఎంలను కలుస్తానన్న తికాయత్
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో గురువారం నాడు రైతు ఉద్యమ నేత, బీకేయూ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ భేటీ అయిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వచ్చిన సమయంలోనే తికాయత్ కూడా కేసీఆర్ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరితో కలిసి కేసీఆర్ లంచ్ కూడా చేశారట. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి త్వరగానే కేసీఆర్‌తో చర్చలు జరిపి వెళ్లిపోగా.. తికాయత్ మాత్రం చాలా సేపు కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపుగా వీరి భేటీ 3 గంటల పాటు సాగినట్లు సమాచారం.
కేసీఆర్‌తో భేటీ సమయంలో రాజకీయాలు అసలు ప్రస్తావనకే రాలేదని తికాయత్ స్పష్టం చేశారు. కేసీఆర్‌తో భేటీ ముగించుకుని బయటకు వచ్చిన ఆయన అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను రైతు నేతనని, రాజకీయాలతో తనకు సంబంధం లేదని తికాయత్ చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, దీని పరిష్కారం కోసం వ్యవసాయ ప్రత్యామ్నాయ విధానాల కోసం కేసీఆర్‌ను కలిశానని ఆయన చెప్పారు. ఇదే విషయంపై తాను దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలను కూడా కలవనున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్‌తో భేటీ సందర్భంగా అసలు రాజకీయాల గురించిన ప్రస్తావనే తమ మధ్య రాలేదని తికాయత్ వెల్లడించారు.