సీఎం జగన్ కు చిత్ర పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు: చిరంజీవి
- ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు
- కొత్త జీవో జారీ చేసిన ప్రభుత్వం
- పరిశ్రమకు మేలు కలుగుతుందన్న చిరంజీవి
- ప్రజలకు వినోదం అందుబాటులో ఉంటుందని వ్యాఖ్య
ఏపీలో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సవరణ జీవో తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారని, థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరలు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేశారని కొనియాడారు. అందుకు ఏపీ సీఎం జగన్ కు చిత్ర పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చిరంజీవి వెల్లడించారు.
ముఖ్యంగా చిన్న సినిమాలకు ఐదవ షో వేసుకునే అవకాశం కల్పించడం ఎంతోమంది నిర్మాతలకు ఉపయోగపడే అంశం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానీకి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు.