ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఆన్ లైన్లో సినిమా టికెట్ల అమ్మకాలు?

  • టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం
  • జస్ట్ టికెట్స్ సంస్థ టెండర్ దక్కించుకున్నట్టు సమాచారం
  • థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రభుత్వమే డబ్బులు ఇవ్వనున్న వైనం
ఏపీలో ఇకపై సినిమా టికెట్లు ఆన్ లైన్లోనే లభించనున్నాయి. ఆన్ లైన్లో టికెట్ అమ్మకాలకు టెండర్లను పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ ధరకే లభించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలకు రెండు సంస్థలు పోటీ పడగా.. జస్ట్ టికెట్స్ సంస్థ ఎల్-1గా నిలిచినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఆన్ లైన్లో టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆన్ లైన్లో టికెట్లను విక్రయించగా వచ్చిన డబ్బును ప్రభుత్వమే థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వనుంది. ఈ నిర్ణయంతో బ్లాక్ టికెట్స్ దందాకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


More Telugu News