అందుకే వ‌రి పంట వేయొద్ద‌ని కేసీఆర్ చెప్పారు: మంత్రి స‌బిత‌

  • కేంద్ర స‌ర్కారు వరి ధాన్యం కొనుగోలు చేయాలి
  • కేంద్ర ప్ర‌భుత్వ తీరు గురించి ముందే కేసీఆర్‌కు తెలుసు
  • వరి పంట‌ వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్న మంత్రి 
  • ఇప్పుడు మాత్రం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని విమర్శ 
కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై నిర‌స‌న‌లు తెల‌పాల‌ని తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ఇచ్చిన‌ పిలుపు మేరకు మహేశ్వరంలో టీఆర్ఎస్ నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర స‌ర్కారు వరి ధాన్యం కొనుగోలు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరు గురించి ముందే కేసీఆర్‌కు తెలుస‌ని, అందుకే వరి సాగు చేయకూడ‌ద‌ని రాష్ట్ర రైతుల‌కు కేసీఆర్ ముందుగానే సూచించార‌ని ఆమె చెప్పారు. 

అయిన‌ప్ప‌టికీ, వరి పంట‌ వేయాలని బీజేపీ నేతలు రాష్ట్ర‌ రైతులను రెచ్చగొట్టారని ఆమె ఆరోపించారు. వ‌రి కొనుగోళ్లు జ‌రిగేలా చేస్తామ‌ని బీజేపీ నేతలు చెప్పార‌ని, ఇప్పుడు మాత్రం వారు దీని గురించి ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని విమ‌ర్శించారు. ధాన్యం కొనుగోళ్లు చేసేంత వరకు తాము కేంద్రాన్ని విడిచిపెట్టబోమ‌ని అన్నారు.


More Telugu News