400 కోట్ల మార్కుకి చేరువలో 'విక్రమ్'
- ఈ నెల 3న విడుదలైన 'విక్రమ్'
- కమల్ సొంత బ్యానర్లో వచ్చిన సినిమా
- దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్
- 17 రోజుల్లో 370 కోట్ల గ్రాస్ వసూలు
కమలహాసన్ కి హీరోగా .. నిర్మాతగా ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. ఎప్పటిలానే ఆయన సాహసాలు ... ప్రయోగాలు చేశారు .. కానీ కాలం కలిసి రాలేదు. దాంతో కొంతకాలంగా ఆయన తన స్థాయికి తగిన హిట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఆర్థికపరమైన సమస్యలను ఫేస్ చేస్తూనే ఆయన 'విక్రమ్' సినిమాను నిర్మించారు.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. చాలాకాలం తరువాత ప్రేక్షకులు తెరపై మునుపటి కమల్ ను చూశారు. స్క్రీన్ ప్లే సామాన్య ప్రేక్షకులకు కాస్త క్లిష్టంగా అనిపించినా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లో ఈ సినిమా 370 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా సమాచారం. 400 కోట్ల మార్క్ ను చేరుకోవడానికి ఇంకా ఎంతో సమయం పట్టదనే విషయం అర్థమైపోతూనే ఉంది. ఈ 3 వారాల్లో వేరే సినిమాలు చాలా థియేటర్లకు వచ్చినా, అవి 'విక్రమ్' వసూళ్లపై ప్రభావం చూపించలేకపోవడం విశేషం.