వైసీపీ ప్లీనరీకి సర్వం సిద్ధం.. జగన్ నుంచి కార్యకర్త వరకు అందరికీ ఒకటే మెనూ!

  • ఈరోజు, రేపు కొనసాగనున్న వైసీపీ ప్లీనరీ
  • కిటకిటలాడుతున్న ప్లీనరీ ప్రాంగణం
  • 25 రకాల వంటకాలతో సిద్ధమవుతున్న భోజనాలు
వైసీపీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమయింది. విజయవాడ-గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ప్లీనరీ ప్రాంగణానికి వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ ఇది కావడం గమనార్హం. మొత్తం మీద ఇది మూడో ప్లీనరీ. వైసీపీ ప్రజా ప్రతినిధులు మొదలు, ఆ పార్టీకి చెందిన వార్డు మెంబర్ల వరకు పార్టీ అధినేత జగన్ పేరుమీద ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో, పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు ప్లీనరీకి కదిలి వస్తున్నాయి. ప్లీనరీ ప్రాంగణం మొత్తం పార్టీ శ్రేణులతో కిటకిటలాడుతోంది. 

మరోవైపు ప్లీనరీకి వస్తున్న వారి కోసం పసందైన వంటకాలు రెడీ అవుతున్నాయి. టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ తయారవుతున్నాయి. రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను వండివారుస్తున్నారు. పార్టీ అధినేత జగన్ నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరికీ ఒకే మెనూ సిద్ధమవుతోంది. వంటవాళ్లను ద్రాక్షారామం, ఇందుపల్లి ప్రాంతాల నుంచి రప్పించారు. ఈ రోజు, రేపు ఉదయం టిఫిన్లుగా ఇడ్లీ, పొంగల్, ఉప్మా, మైసూర్ బజ్జీలను అందిస్తున్నారు. నోరూరించే 25 రకాల వంటకాలతో భోజనాలను అందించనున్నారు.


More Telugu News