ఇలాంటి పాత్రలో రష్మికను ఇంతకుముందు చూసుండరు: దుల్కర్
- దుల్కర్ - మృణాల్ జంటగా 'సీతా రామం'
- ప్రేమకథా నేపథ్యంలో నడిచే సినిమా
- కీలకమైన పాత్రలో రష్మిక
- ఈ నెల 5వ తేదీన సినిమా విడుదల
మలయాళ స్టార్ హీరోలలో దుల్కర్ ఒకరు .. ఏడాదికి 3 సినిమాలు చేస్తూ అక్కడి హీరోలకు ఆయన గట్టిపోటీ ఇస్తున్నాడు. తెలుగులో నేరుగా ఆయన చేసిన సినిమానే 'సీతా రామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో దుల్కర్ మాట్లాడాడు.
"ఇది ఒక అందమైన ప్రేమకథ .. సహజత్వానికి దగ్గరగా నడిచే కథ. హను రాఘవపూడి ఈ కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. ఈ సినిమాకి సీత పాత్ర ప్రాణం లాంటిది. ఆ పాత్రకి మృణాల్ ప్రాణం పోసింది. ఆమె తప్ప ఆ పాత్రను ఆ స్థాయిలో ఎవరూ పండించలేరు అనేంత గొప్పగా చేసింది. సినిమా విడుదల తరువాత బయట ఇదే మాట వినిపిస్తుంది.
ఇక రష్మిక విషయానికి వస్తే తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతవరకూ తాను ఈ తరహా పాత్రను చేయలేదు. తెరపై ఒక కొత్త రష్మికను చూస్తారు. ఈ సినిమాకి ఆమె పాత్ర ప్రత్యేకమైన ఆకర్షణ అని చెబుతాను. కథాకథనాలతో పాటు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.