ఈ నెల 30న తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు

  • తిరుమలలో ఈ నెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు
  • అక్టోబరు 1న గరుడ వాహన సేవ
  • ద్విచక్రవాహనాలను అనుమతించబోమన్న ఎస్పీ
  • పరిస్థితులను బట్టి కార్లకు కూడా నో ఎంట్రీ అని వెల్లడి
తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 వరకు జరగనున్నాయి. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ నిర్వహిస్తున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో, తిరుమల వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించారు. 

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో, ఈ నెల 30న తిరుమల వెళ్లే ద్విచక్రవాహనాలపై ఆంక్షలు ఉన్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. అక్టోబరు 1న తిరుమలలో శ్రీవారి గరుడ వాహన సేవ ఉంటుందని, అందుకే ఈ నెల 30 నుంచి తిరుమలకు టూ వీలర్స్ ను అనుమతించబోమని వెల్లడించారు. 

పరిస్థితిని బట్టి తిరుమలకు కార్లను కూడా అనుమతించబోమని వివరించారు. భక్తులు కార్లను తిరుపతిలో పార్క్ చేసి, ఆర్టీసీ బస్సులలో తిరుమలకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు.


More Telugu News