ఫ్లాపుల్లో ఉన్న ముగ్గురు స్టార్ హీరోలకు ఈ సినిమా కీలకమే!

  • మణిరత్నం నుంచి భారీ చిత్రం
  • చోళరాజుల కాలంలో నడిచే కథ 
  • భారీ తారాగణమే ప్రధానమైన ఆకర్షణ 
  • ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా రిలీజ్    
ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ కూడా 'పొన్నియిన్ సెల్వన్' గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది మణిరత్నం కల .. ఆయన కసరత్తు అంటూ చెప్పుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వివిధ భాషల్లో ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఇంతటి భారీ సినిమాలు ఇంతకుముందు వచ్చాయిగానీ, ఇంతమంది స్టార్స్ తో రాలేదనే చెప్పాలి. 

అయితే ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన ముగ్గురు హీరోలకు కూడా దీనికి ముందు హిట్ లేకపోవడం గమనించవలసిన విషయం. విక్రమ్ పెద్ద స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన నుంచి ఇటీవల వచ్చిన 'కోబ్రా' పరాజయాన్ని చవిచూసింది. అందులో చాలా గెటప్పులతో విక్రమ్ పడిన కష్టాలకి ప్రయోజనం లేకుండా పోయింది. 

ఇక కార్తి విషయానికి వస్తే ఈ సినిమాకి ముందు ఆయన చేసిన 'విరుమాన్' ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. రొటీన్ కి భిన్నంగా వెళ్లడం లేదనే విమర్శలు వచ్చాయి. ఇక జయం రవి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అందువలన ఈ ముగ్గురు హీరోలు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఒకే తెప్పపై సక్సెస్ తీరానికి చేరుకోవడానికి ట్రై చేస్తున్నారు.


More Telugu News