ఈ శుక్రవారం రిలీజ్ కి నాలుగు సినిమాలు .. పోటీ గట్టిగానే ఉందే!

  • యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందిన 'జిన్నా'
  • దేవుడికీ .. మనిషికీ మధ్య నడిచే సరదా సంభాషణే 'ఓరిదేవుడా'
  • లుక్ తోనే ఆసక్తిని పెంచుతున్న కార్తి 'సర్దార్'
  • 'ప్రిన్స్' తెలుగు ఆడియన్స్ ముందుకు శివ కార్తికేయన్ 
  • ఈ నెల 21వ తేదీన భారీస్థాయి విడుదల  
ఈ నెల 21వ తేదీ శుక్రవారం నాలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. నాలుగు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ కి చెందినవే. మంచు విష్ణు హీరోగా రూపొందిన 'జిన్నా' సినిమాకి బజ్ బాగానే ఉంది. కామెడీ పల్స్ బాగా తెలిసిన జి. నాగేశ్వర రెడ్డి - కోన వెంకట్ ఈ కథ వెనక ఉన్నారు. అనూప్ రూబెన్స్ అందించిన మాస్ బీట్స్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన థియేటర్ల దగ్గర కొంత సందడి కనిపించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక విష్వక్ సేన్ హీరోగా రూపొందిన 'ఓరి దేవుడా' .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది. లవ్ .. కామెడీతో పాటు మనిషికీ .. దేవుడికి మధ్య గల లింక్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా, విష్వక్సేన్ ను కొత్తగా చూపించనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చరణ్ రావడంతో, అందరి దృష్టి ఈ సినిమా వైపుకు తిరిగింది. ఇక తమిళంలో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న శివ కార్తికేయన్, తెలుగులో కూడా మంచి మార్కెట్ ను సొంతం చేసుకునే పనిలో ఉన్నాడు. ఆ నేపథ్యంలో తెలుగులో ఆయన చేసిన సినిమానే 'ప్రిన్స్'. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళంతో పాటు తెలుగులోను కార్తి 'సర్దార్' రంగంలోకి దిగుతోంది. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రాశి ఖన్నా - రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. పెద్ద బ్యానర్లలో .. డిఫరెంట్ జోనర్స్ లో వస్తున్న ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా ఎక్కువ వసూళ్లను రాబడుతుందో చూడాలి.


More Telugu News