ఆ విషయంలో విష్వక్ చేసింది తప్పే: డైరెక్టర్ జి.నాగేశ్వర రెడ్డి

  • అర్జున్ - విష్వక్ గొడవపై స్పందించిన జి.నాగేశ్వర రెడ్డి
  • దర్శకుడిగాను అర్జున్ కి మంచి అనుభవం ఉందని వెల్లడి 
  • విష్వక్ కష్టపడి ఎదుగుతూ వస్తున్నాడంటూ ప్రశంసలు 
  • అతను ముందుగానే క్లారిటీ తీసుకోవలసిందని వ్యాఖ్య
ఈ మధ్య కాలంలో యాక్షన్ కింగ్ అర్జున్ .. హీరో విష్వక్సేన్ ఒకరి పై ఒకరు చేసుకున్న ఫిర్యాదు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమా విషయంలో తన అభిప్రాయాలకు విలువ లేకుండా చేశారని విష్వక్ అంటే, ఆయన ధోరణి చాలా ఇబ్బంది పెట్టిందని అర్జున్ తేల్చేశాడు. ఏదైతేనేం మొత్తానికి విష్వక్ లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ విషయంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ .. స్పందిస్తూ, విష్వక్ అలా చేయకుండా ఉండవలసింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఇదే విషయాన్ని గురించి డైరెక్టర్ జి.నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ .. "అర్జున్ గారు చాలాకాలం క్రితమే సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్. విష్వక్ విషయానికొస్తే తను ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి ఎదుగుతున్నవాడు. అలాంటివారిద్దరి మధ్య గొడవ వచ్చింది" అన్నారు. 

"కథ చెప్పేశాం కదా అని అర్జున్ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ జనరేషన్ హీరోలు ఎలా ఉన్నారంటే ఏం జరుగుతుందన్నది మొత్తం తమకి తెలియాలంటున్నారు. అవసరమైతే ట్రీట్మెంట్ లో కూర్చుంటున్నారు. మొత్తం 70 సీన్లు చెప్పిన తరువాత షూటింగు మొదలుపెడదామని విష్వక్ అంటే సరిపోయేది. కానీ ఆయన షూటింగు ఆపమని అనడం తప్పు. ఒక్కోసారి చుట్టూ ఉన్నవారి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. షూటింగుకి వెళ్లడానికి ముందు అర్జున్ - విష్వక్ మధ్య ఒక పాజిటివ్ మీటింగ్ జరిగుంటే బాగుండేది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


More Telugu News