'లవ్ టుడే' రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గిన దిల్ రాజు?
- తమిళంలో హిట్ కొట్టిన 'లవ్ టుడే'
- హీరోగా ప్రదీప్ రంగనాథన్
- అతనే ఈ సినిమాకి దర్శకుడు కూడా
- ఈ వారం రిలీజ్ చేద్దామనుకున్న దిల్ రాజు
- ప్రమోషన్స్ కి సమయం లేకపోవడం వాయిదా పడినట్టు టాక్
తమిళంలో ఈ నెల 4వ తేదీన 'లవ్ టుడే' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఘోరామ్ .. గణేశ్ .. సురేశ్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ రంగనాథన్ దర్శకుడు. ఆయనే ఈ సినిమాలో హీరో కూడా. తమిళంలో ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. అదే రోజున ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పుడు ఇక్కడ గట్టిపోటీ ఉండటంతో వెనక్కి తగ్గారు. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు.
ఈ వారం 'గాలోడు' .. మసూద' .. ' అలిపిరికి అల్లంత దూరంలో' సినిమాలు మాత్రమే రిలీజ్ కి ఉన్నాయి. ఒక్క 'మసూద' తప్ప మిగతా సినిమాలపై బజ్ లేదు. అందువలన ఈ వారం 'లవ్ టుడే' సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు భావించారు. అందువల్లనే నిన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విజయ్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని ఆయన ప్లాన్ చేశారు. కానీ కృష్ణ మరణం కారణంగా ట్రైలర్ రిలీజ్ జరగలేదు.
ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమా ట్రైలర్ జనంలోకి వెళ్లలేదు. హీరో - హీరోయిన్ ఇద్దరూ కూడా ఇక్కడి ప్రేక్షకులకు తెలియదు. కంటెంట్ ను కనెక్ట్ చేసే సమయం లేదు. అందువలన ఈ వారం ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనను దిల్ రాజు విరమించుకున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో కథానాయికగా 'ఇవాన' నటించింది. 2012లో మలయాళ సినిమాల ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కోలీవుడ్ తెరకి పరిచయమైంది. తమిళంలో ఇది ఆమెకి మూడో సినిమా. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. సత్యరాజ్ .. రాధిక .. యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషించారు.