10 రోజుల్లో 89 కోట్లు .. కొనసాగుతున్న 'ధమాకా' హవా!

  • ఈ నెల 23న విడుదలైన 'ధమాకా'
  • రవితేజ మార్క్ మాస్ యాక్షన్ మూవీ 
  • భీమ్స్ సంగీతం ఈ సినిమాకి హైలైట్
  • 100 కోట్ల క్లబ్ చేరువలోకి వచ్చేసిన సినిమా
రవితేజ మార్క్ కథలో అన్ని అంశాలు కుదిరితే ఎలా ఉంటుందనేది నిరూపించిన సినిమాగా 'ధమాకా' కనిపిస్తుంది. రెండు ఫ్లాపుల తరువాత ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. రవితేజ ఇక మూస కథల్లో నుంచి బయటికి రాకపోతే కష్టమేననే అభిప్రాయలు కూడా వినిపించాయి. అయినా తన నుంచి ఫ్యాన్స్ కోరుకునేది ఇదేనంటూ రవితేజ 'ధమాకా' చేశాడు. 

రవితేజ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఉంటుందని చాలామంది భావించారు. అయితే ఈ సినిమా నుంచి ఒక్కో సాంగును వదులుతూ ఉంటే, నెమ్మదిగా అంచనాలు పెరగడం మొదలైంది. పాటల కోసమైనా ఈ సినిమాను చూడాలనే ఆలోచనను కలిగించడంలో సంగీత దర్శకుడు భీమ్స్ సక్సెస్ అయ్యాడు.
  
ఈ నెల 23వ తేదీన భారీస్థాయిలో విడుదలైన ఈ సినిమా, తొలి రోజునే 10 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. 10 రోజుల్లో 89 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా వదిలారు. ఇక ఈ రోజునో .. రేపో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనే విషయం తెలిసిపోతూనే ఉంది.


More Telugu News