మన జాతి భవిష్యత్తు మీదే: పవన్ కల్యాణ్

  • స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలిపిన పవన్
  • నేడు శ్రీకాకుళంలో జనసేన ‘యువశక్తి’ సభలో  పాల్గొననున్న జనసేన అధినేత
  • 100 మంది యువ ప్రతినిధులు కూర్చునేలా వేదిక ఏర్పాటు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రణస్థలంలో జనసేన నిర్వహించే ‘యువశక్తి’ సభలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం తాళ్లవలస సమీపంలో 25 ఎకరాల ప్రాంగణంలో వేదిక సిద్ధమైంది. పవన్‌తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్‌ నిన్న రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సన్‌రే రిసార్ట్స్‌కు చేరుకున్నారు. 

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు యువశక్తి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 100 మంది యువకులు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రెండు రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. ఇక, ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మన జాతి భవిష్యత్తు మీదే.. జై హింద్!’ అంటూ పవన్‌ ట్వీట్ చేశారు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అని రాసి ఉన్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.


More Telugu News