ఏపీ సీఎం జగన్ రాజధాని గురించి మాట్లాడడం కోర్టు ధిక్కారమే: పురందేశ్వరి
- విశాఖ ఏపీ రాజధాని అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు
- ఏపీ రాజధాని విషయం సుప్రీంకోర్టులో ఉందన్న పురందేశ్వరి
- అమరావతికే తాము కట్టుబడి ఉంటామని వెల్లడి
ఏపీ రాజధాని అమరావతి అని టీడీపీ, బీజేపీ, జనసేన తమ వైఖరిని చాటుతుండగా, అధికార వైసీపీ మాత్రం వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల విధానం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జగన్ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి తప్పుబట్టారు.
ఏపీ రాజధాని విశాఖపట్నమేనని పెట్టుబడిదారుల సమావేశంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని స్పష్టం చేశారు. ఎందుకంటే, ఏపీ రాజధాని విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని పురందేశ్వరి అన్నారు. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అనే విధానానికి తాము కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించారు.