‘ప్రాజెక్ట్–కె’ క్రేజీ అప్‌డేట్.. సినిమాలోకి మరో స్టార్ హీరో ఎంట్రీ!
- ‘ప్రాజెక్ట్–కె’లో కమలహాసన్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటన
- కమల్‌పై ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసిన వైజయంతీ మూవీస్
- కమల్‌తో నటించడం గౌరవంగా భావిస్తున్నానన్న ప్రభాస్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్–కె. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేస్తున్న ఒక్కో పోస్టర్ ఆ అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.
‘ప్రాజెక్ట్–కె’లో ‘లోకనాయకుడు’ కమలహాసన్ నటిస్తున్నట్లు ఈ రోజు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో కమల్ నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఎట్టకేలకు ధ్రువీకరించింది. కమలహాసన్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను ‘ప్రాజెక్ట్-కె’ బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో కమల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమలహాసన్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’’ అని ఆయన అన్నారు.
ఇక ప్రాజెక్ట్–కెలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా పేరుని, మోషన్ పోస్టర్‌ని జులై 3న అమెరికాలో ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం.